ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?
జర్సీ సినిమాలో నానితో నటించిన శ్రద్దా శ్రీనాథ్ ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలో నటించింది. ఈ సినిమా డివైడ్ టాక్ తో రన్ అవుతోంది. అయితే లోగడే ఫలక్ నామా దాస్ సినిమాలో శ్రద్దాకు ఛాన్స్ వచ్చింది. అప్పుడు తను ఫేమున్న హీరోకాదు. అయితే ఆ సినిమా కథ నాకు నచ్చలేదని రిజక్ట్ చేసినట్లు గతంలో చెప్పింది. ఇప్పుడు అదే అమ్మాయిని తీసుకోవడంలో గల కారణాన్ని విశ్వక్ సేన్ ఇటీవల తెలుపుతూ.. అప్పుడు వద్దంది. ఇప్పుడు చేస్తానంది. రేపు ఇంకో హీరోతో సినిమా కథ నచ్చితే చేస్తుంది. ఇందులో ఏముంది అంటూ వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు శ్రద్దా శ్రీనాథ్ బాలక్రిష్ణ సినిమాలో నటించే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం నా లక్క్ వల్లే వచ్చిందని మెకానిక్ రాకీ ప్రమోషన్ లో భాగంగా చెప్పింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. అలా చెబితే ఎలాగమ్నా. నీకు ఎవరో ఒకరు సపోర్ట్ లేకపోతే అవకాశం రాదుకదా.. ఇలా చెప్పకూడదు అంటూ కొందరు స్పందిస్తున్నారు. కానీ విశ్వక్ సేన్ గతంలో అన్నట్లు మరో హీరో కథ నచ్చితే చేస్తుంది అన్నది నిజమైనట్లుగా తెలుస్తోంది.