గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (22:29 IST)

రజనీకాంత్‌లో దిల్ రాజు సినిమా.. అంతా వారసుడి మాయ..?!

rajinikanth
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మెగా ప్రాజెక్టుకు సిద్ధం అవుతున్నారు. రజనీకాంత్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దిల్ రాజు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. లోకేశ్ కనకరాజ్‌తో చేసే సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌తో జైలర్, అలాగే కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌తో లాల్ సలామ్‌లో అతిధి పాత్రలో కనిపించనున్నారు. అంతేగాకుండా.. జై భీమ్ ఫేమ్ TJ. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్నారు. 
 
ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో నటిస్తారని తెలుస్తోంది. విజయ్‌ వారిసు సినిమాతో కోలీవుడ్‌లో సక్సెస్ చవిచూసిన దిల్ రాజు ఇటీవల రజనీకాంత్‌ను కలిసి మెగా ప్రాజెక్ట్ కోసం ఒప్పించారని టాక్.
 
రజనీకాంత్‌తో దిల్ రాజు జట్టుకట్టినట్లయితే అది సంచలనం అవుతుంది. ఎందుకంటే రజనీ సినిమాను తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా విడుదల చేస్తారు.
 
దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్‌ల రాబోయే పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీత దర్శకుడు.