గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 26 జులై 2017 (07:42 IST)

అనుష్క విషయం ఏమో కానీ సాహోలో రకుల్‌కు చాన్స్ వచ్చేనా?

చాలా సంవత్సరాల క్రితం మాట. తెలుగు సినిమాలోకి మరొక అందాల పంజాబీ తార రకుల్ ప్రీత్ సింగ్ రూపంలో వచ్చింది. మొదట్లో ఆమె అంత పేరున్న ముఖం కాదు.కానీ అప్పట్లోనే ప్రభాస్ మూవీ మిస్టర్ ఫర్‌పెక్ట్ చిత్రానికి ఆమె

చాలా సంవత్సరాల క్రితం మాట. తెలుగు సినిమాలోకి మరొక అందాల పంజాబీ తార రకుల్ ప్రీత్ సింగ్ రూపంలో వచ్చింది. మొదట్లో ఆమె అంత పేరున్న ముఖం కాదు.కానీ అప్పట్లోనే ప్రభాస్ మూవీ మిస్టర్ ఫర్‌పెక్ట్ చిత్రానికి ఆమె సైన్ చేసింది. నిజానికి నాలుగురోజుల పాటు ఆమె షూటింగులో పాల్గొంది కూడా. కానీ ఎందుకో.. ఏమైందో కానీ ఆమె స్థానంలో తాప్సీ వచ్చి చేరింది. కానీ తననెందుకు సినిమాలోంచి తీసేశారు అనేది ఇప్పటికీ రకుల్‌కి అర్థం కాలేదు.
 
అదంతా చరిత్ర. కానీ ఇప్పుడు మాత్రం రకుల్‌కి మరో అవకాశం తన్నుకొచ్చింది. సాహో సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు అవకాశం ఇచ్చేవిషయమై నిర్మాతలు పరిశీలిస్తున్నారని సమాచారం.. చిత్రపరిశ్రమలో చరిత్ర సృష్టించిన బాహుబలి 2 తర్వాత ప్రభాస్ తీస్తున్న కొత్త సినిమా కావడంతో సాహోపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 
 
సాహో సినిమాలో అనుష్క  కీలక పాత్ర పోషించనుందని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ ఆమె సినిమా కోసం పనిచేయనున్నట్లు ఎవరూ ఇంతవరకు నిర్ధారించలేదు. ఇన్నేళ్ల తర్వాత రకుల్ ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ తనను మిస్టర్ ఫర్ పెక్ట్ సినిమాలోంచి ఎందుకు తీసేశారని అడగడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే ఆమె సాహో సినిమాలో నటించడానికి ప్రధాన పోటీదారుగా నిలిచింది.