గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (16:36 IST)

విజయ్ దేవరకొండతో అయితే లిప్‌లాక్ కిస్సులేంటి... ఏదేనా చేస్తా (Video)

తెలుగు చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా.. ఇపుడు లిప్ లాక్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. నో కిస్సింగ్ ఆన్‌స్క్రీన్‌ రూల్ బ్రేక్ చేసినట్టయితే తాను రెచ్చిపోతానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా, లిపి లాక్ చేయాల్సి వస్తే టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండతోనే చేస్తానని తెలిపింది. అతనితో అయితే, లిప్ లాక్ కిస్సులేంటి ఏదైనా చేస్తానని చెప్పుకొచ్చింది.
 
తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్న తమన్నా.. ఇప్పటివరకు ఆన్ స్క్రీన్‌పై లిప్ లాక్ చేయలేదు. అంటే ఏ ఒక్క హీరోతోనూ ఆమె ముద్దు సీన్లలో నటించలేదు. కనీ, గ్లామర్‌ షో విషయంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటివరకు ఏ హీరోకి లిప్‌లాక్‌ మాత్రం ఇవ్వలేదు. 
 
ఇక తాజాగా తెలుగు ఓటీటీ 'ఆహా'లో సినీ నటి సమంత అక్కినేని హోస్ట్ చేస్తున్న 'సామ్‌ జామ్‌' షోలో తమన్నా పాల్గొంది. ఈ సందర్భంగా తమన్నాకు లిప్‌లాక్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. 
 
ఇందులో 'నో కిస్సింగ్‌ ఆన్‌ స్ర్కీన్‌ రూల్‌ బ్రేక్‌ చేస్తే.. ఎవరితో కిస్‌ చేయడానికి ఇష్టపడతావు..?' అని తమన్నాని సమంత ప్రశ్నించింది. దీనికి తమన్నా ఏ హీరో పేరు చెప్పిందో తెలుసా? 'ఐ లైక్‌ టు కిస్‌.. విజయ్‌ దేవరకొండ'.. అని చెప్పడంతో ఒకటే ఈలలు, చప్పట్లు. టీజర్‌ రెడీ అంటూ సమంత కూడా కాస్త హడావుడి చేసింది. 
 
ఇక అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌.. ఎవరు చూసినా విజయ్‌ దేవరకొండ పేరే చెబుతున్నారంటే.. రౌడీ హీరో రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడందరికీ విజయ్‌ దేవరకొండే కావాలి.. అన్నట్లుగా మారిపోయింది. ఇక పూరీ 'ఫైటర్‌' తర్వాత విజయ్‌ రేంజ్‌ మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.