నర్తనశాల 2.0 ఖాయమేనా?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన 'నర్తనశాల'ను పూర్తిచేసే ప్రయత్నాలను బాలయ్య బాబు ముమ్మరం చేస్తున్నట్లే కనిపిస్తోంది. 2004లో ఒకసారి ఈ షూటింగ్ ప్రారంభించి సౌందర్య మరణంతో ఈ ప్రాజెక్టుకు పేకప్ చెప్పేసిన బాలకృష్ణ ఇప్పుడు దసరా సందర్భంగా 17 నిమిషాల నిడివిగల సన్నివేశాలను డిజిటల్ ఫ్లాట్ఫార్మ్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
అందులో భాగంగా వరుసగా అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపదిగా సౌందర్య.. భీముడిగా శ్రీహరి స్టిల్స్‌ను నెట్లో విడుదల చేశారు. వాటికి ప్రేక్షకులనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో తాజా అప్డేట్ ఏమిటంటే నర్తనశాల ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించి పూర్తిచేయాలన్న ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్లు తెలుస్తోంది.
దసరా రోజు విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రోత్సహిస్తే మళ్ళీ ఈ పూర్తి సినిమాని బహుశా తీస్తానేమోనని బాలయ్య చెప్పుకురావడంతోనే అర్థం కావడంలేదు బాలయ్యబాబు నర్తన శాలను పూర్తిచేసి తీరతాడని. ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు.