గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీ.వీ.
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (17:48 IST)

సంక్రాంతి బరిలో పోటీగా విజయ్‌దేవరకొండ వస్తున్నాడు?

viJaydevarakonda
viJaydevarakonda
తెలుగు సినిమాలకు సంక్రాంతి చాలా పెద్ద పండుగ. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రవారికే కాకుండా ఓవర్‌సీస్‌ వారికి కూడా ఇది కుటుంబ పండుగ. అందుకే ఆరోజు అటు ఇటుగా సినిమాలు విడుదలవుతుంటాయి. ఇప్పటికే వెంకటేష్‌ సైంధవ్‌తోపాటు రవితేజ కూడా తాజా సినిమాతో ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్‌ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ఇక ఇప్పుడు విజయ్‌దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాను జనవరి 14న విడుదల చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి కాంబినేషన్‌లో గీతా గోవిందం వచ్చింది. అది విజయ్‌ కెరీర్‌ను మార్చేసింది. మరలా అంతలా ఆయనకు సక్సెస్‌ లేదనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి సక్సెస్‌ రాబోతున్నట్లు విజయ్‌ ఆకాంక్షించారు. ఈ సినిమాలో మృణాల్‌ ఠాగూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఈనెలాఖరు టీజర్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. అప్పుడు విడుదలతేదీ తెలిపనున్నట్లు సమాచారం.