సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: సోమవారం, 16 జులై 2018 (21:46 IST)

క‌ళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఎప్పుడు..? ఎవ‌రితో..?

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. రాకేష్ శ‌శి తెర‌కెక్కించిన చిత్రం విజేత‌. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్ పైన సాయి కొర్రపాటి నిర్మించిన విజేత చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ఆద‌ర‌ణ పొందుతోంది. ముఖ్యంగా తండ్రీకొడుకు

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. రాకేష్ శ‌శి తెర‌కెక్కించిన చిత్రం విజేత‌. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్ పైన సాయి కొర్రపాటి నిర్మించిన విజేత చిత్రం కుటుంబ క‌థా చిత్రంగా ఆద‌ర‌ణ పొందుతోంది. ముఖ్యంగా తండ్రీకొడుకుల మ‌ధ్య చిత్రీక‌రించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం విజేత సినిమా త‌న‌కు ఎంత‌గానో న‌చ్చింద‌ని ప్ర‌త్యేకంగా స‌క్స‌ెస్ మీట్‌కు హాజ‌రై చెప్పారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... క‌ళ్యాణ్ దేవ్ రెండో సినిమా గురించి క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. అయితే.. డైరెక్ట‌ర్ ఎవ‌రు అనేది ఇంకా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు. ఇటీవ‌ల హ‌రీష్ శంక‌ర్‌ని మెగా కాంపౌండ్ పిలిపించార‌ని.. క‌ళ్యాణ్ దేవ్‌తో సినిమా చేయ‌మ‌ని అడిగార‌ని టాక్ వ‌చ్చింది. దీనికి హ‌రీష్ ఓకే చెప్పార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం పూర్తి వివ‌రాల‌ను ఓ ప‌ది రోజుల్లో ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది. మ‌రి... హ‌రీష్ శంక‌రే డైరెక్ట్ చేస్తారా...? లేక వేరే డైరెక్టరా అనేది తెలియాల్సివుంది.