మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (15:20 IST)

నడిగర్ సంఘం ముందడుగు - మా అసోసియేసన్ వెనకడుగు?

kamalhaasan, Karthi, Poochi Murugan, vishal
kamalhaasan, Karthi, Poochi Murugan, vishal
సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) 67వ జనరల్ బాడీ సమావేశం సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది. ఈ జనరల్ కమిటీ సమావేశంలో ప్రముఖుల నుంచి నిధి వసూలు చేసి కొత్త భవంతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అధ్యక్షుడు నాజర్, అసోసియేషన్ సభ్యులు విశాల్, కార్తీ, శ్రీమన్, కోవై సరళ సహా పలువురు కార్యవర్గ సభ్యులు నిధి వసూలు కోససం ప్రయత్నిస్తున్నారు.
 
తాజాగా భారత్ ఐకాన్ స్టార్ కమల్ హాసన్ ఇందులో భాగమయ్యారు. కోటి రూపాయల చెక్ ను కార్తీ, విశాల్ సమక్షంలో నిన్న అందజేశారు.  ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయని విశాల్ అన్నారు.  సినిమాల్లోనే కాకుండా థియేటర్ ఆర్టిస్టుల జీవనోపాధిపై నమ్మకం ఉన్న సామాన్యుడిగా కూడా మా అందరికీ స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు సర్. మీతో సుమారు గంటసేపు గడిపిన సమయం హార్వర్డ్ క్యాంపస్‌లో ఉన్నట్లుగా ఉంది, చాలా అంతర్దృష్టులు. చాలా జ్ఞాపకాలను పంచుకున్నారు.  మా కొత్త భవనంలోని ఔత్సాహిక కళాకారులందరికీ ఇది మళ్లీ మళ్లీ జరగాలని మేము కోరుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సర్. కఠిన మా పని ఎప్పుడూ విఫలం కాదు. మీరు దానికి నిదర్శనం అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
 
దీనిపై తెలుగు చలనచిత్రరంగంలో నటులుకూడా స్పందిస్తూ పోస్ట్ చేశారు. తెలుగులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్ (మా) కోసం గతంలో ఓ స్థలలంచూశారు. కానీ అది సరిగ్గా లేదని ఆ తర్వాత కొత్త కమిటీ విరమించుకుంది. అనంతరం వచ్చిన మంచు విష్ణు అధ్యక్షతన నూతన భవనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అవసరమైతే తానే కట్టిస్లానని పేర్కొన్నారు. కానీ ఒక్క అడుగు ముందగుడు పడలేదు. పదవీ కాలం పూర్తయింది. మరలా ఎన్నికలు జరగలేదు. గత కొన్నేళ్ళుగా మా భవనం ఎండమావిగా మారిందని సీనియర్ నటులు వాపోతున్నారు. ఏదిఏమైనా తెలుగు, తమిళుల అసోసియేషన్ లో వ్యత్యాసం వుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
 
ఇటీవలే సీనియర్ నటుడు నాగబాబు కూడా మా అసోసియేషన్ పనివిధానంపై విమర్శలు చేయడమేకాకుండా ఎలక్షన్లు ఎందుకు జరపడలంలేదో అని ప్రతి సభ్యుడు అడగాల్సిన సమయం ఆసన్నమైందని ఓ సభలో చెప్పారు. ఇదిలా వుండగా, ప్రస్తుత మా అధ్యక్షుుడు కన్నప్ప సినిమా షూట్ లో బిజీగా వున్నారు.