ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (10:49 IST)

మహేష్ బాబు జర్మనీ టూర్ రహస్యం ఇదేనట ?

mahesh babu
mahesh babu
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత కాస్త విరామం తీసుకుని తర్వాత ప్రాజెక్ట్ పై కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు. దర్శకుడు రాజమౌళి సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించి వ్యక్తిగా, నటుడిగా సరికొత్తగా కనిపించాలని మహేష్ బాబు జర్మనీ వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ ఫేమస్ డాక్టర్ హ్యారీ కొనిగ్. ఆయన  బెర్నెన్స్ పార్క్ హోటల్ లో స్పా నిర్వహిస్తుంటారు. గుంటూరు కారంలో బాడీఅంతా ఓ రకంగా వుండడంతో ఇక్కడే కొద్దిగా వ్యాయామం చేసినా హాలీవుడ్ సినిమా కోసం మరికాస్త కసరత్తు అవసరం అని రాజమౌళి సూచన మేరకు జర్మనీ వెళ్ళినట్లు విశ్వసనీయసమాచారం.
 
తన శరీరానికి వయస్సుకు సంబంధించిన టిప్స్, వ్యాయామాలు ఇతర సూచనలు తీసుకునేందుకు వెళ్ళినట్లు సమాచారం. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఇక్కడే వాటిని అమలు చేస్తూ రాజమౌళి సినిమాలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 
 
రాజమౌళి సినిమా ఇండియా జోన్స్ తరహాలో వుంటుందనీ ఆమధ్య రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. చూశారు. అంతకుమించి విజువల్స్ ట్రీట్ వుంటుందని అన్నారు. సో. సరికొత్తగా మహేష్ బాబును అభిమానులు చూసి తరిస్తారన్నమాట. ఈ సినిమా ఉగాదినాటికి లాంచనంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.