ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:01 IST)

అభిమానులకు ఇష్టం లేకపోయినా ఆ పని చేస్తానంటున్న నమిత

ఇప్పుడు వెబ్ సిరిస్‌ల హవా నడుస్తుందన్నది అందరికీ తెలిసిందే. పెద్ద స్టార్లు అందరూ ఇటువైపే చూస్తున్నారు. అవకాశాలు తగ్గడంతో అప్పటి స్టార్ హీరోయిన్స్ కూడా ఈ దిశగా అడుగులు వేసేస్తున్నారు. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ పుణ్యమా అని హీరోహీరోయిన్లు అవకాశాలతో దూసుకుపోతున్నారు. 
 
మీనా, ఖుష్బూ, రమ్యకృష్ణతో  పాటు పలువురు నాయికలు వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నటి నమిత కూడా ఓ సిరీస్‌లో నటిస్తోందట. మలయాళం, తమిళ భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలను తానే వెల్లడిస్తానని నమిత చెబుతోంది.
 
నమిత ఒకప్పుడు ప్రభాస్, బాలయ్య లాంటి స్టార్స్‌తో నటించిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోలతో నటించిన నమిత ప్రస్తుతం వెబ్ సిరీస్ వైపు అడుగులు వేయడం ఆమె అభిమానులకు ఇష్టం లేకపోయినా ఆమె మాత్రం ఇదే బాగుంటోందని చెబుతోందట.