మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 18 ఆగస్టు 2018 (16:09 IST)

రష్మిక ప్లీజ్... అంటూ బతిమాలుతున్న నాని... ఎందుకు?

రెండు సినిమాలతో తానేంటో తెలుగు సినీపరిశ్రమలో నిరూపించుకుంది రష్మిక మందన. ఛలో, గీత గోవిందం సినిమాలతో తన నటనా ప్రతిభతో యువ ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. రష్మిక అంటే ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రష

రెండు సినిమాలతో తానేంటో తెలుగు సినీపరిశ్రమలో నిరూపించుకుంది రష్మిక మందన. ఛలో, గీత గోవిందం సినిమాలతో తన నటనా ప్రతిభతో యువ ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. రష్మిక అంటే ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రష్మిక ఒక బ్రాండ్.
 
ఆమెను తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు యువ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో మొదటగా నాని ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్-2లో బిజీగా ఉండే నానికి ఒక కథ నచ్చిందంట. దర్శకుడు బోయపాటి శ్రీను ఒక కథను నానికి వినిపించినట్లు తెలుస్తోంది. యాక్షన్, ప్రేమ రెండు కలకలిసిన ఈ కథలో హీరోయిన్ ఎవరిని పెడదామని దర్శకుడు బోయపాటి నానిని సలహా అడిగాడట. దీంతో ఠక్కున నాని రష్మిక మందన పేరు చెప్పారట. 
 
మూడు సినిమాల్లో బిజీగా ఉన్న రష్మిక మన సినిమాలో నటిస్తుందా అని దర్శకుడు ప్రశ్నించగా ఆమెతో మాట్లాడి మన సినిమాలో నటించపజేసే బాధ్యత తనదంటూ చెప్పాడట నాని. ఇప్పుడు అదేపనిలో ఉన్నాడట. మరి నాని పిలిస్తే రష్మిక సినిమాకు ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.