ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (09:44 IST)

సిరి సెల్లతో నారా రోహిత్ నిశ్చితార్థం.. నిజమేనా?

Pratinidi 2  Nara Rohit
నారా రోహిత్ బాణం మూవీతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నారా రోహిత్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ వుంది. నారా రోహిత్ ఖాతాలో సోలో, రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి వంటి కొన్ని పెద్ద హిట్స్ వున్నాయి. 
 
తర్వాత అతను సినిమాలు చేయలేదు. ఆపై ప్రతినిధి-2తో తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో నారా రోహిత్ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో నారా రోహిత్ ప్రతినిది-2 నటి సిరి లెల్లతో అక్టోబర్ 13, 2024న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వినికిడి. 
 
నారా రోహిత్ ప్రస్తుతం సుందరకాండ చిత్రీకరణను పూర్తి చేసుకున్నాడు. టీజర్ ఇటీవల విడుదలైంది.