శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (20:09 IST)

థాయ్‌లాండ్‌లో నయన-విక్కీ.. నా స్వీట్ హార్ట్‌తో..?

Nayana_vicky
Nayana_vicky
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జోడీ థాయ్‌లాండ్‌ను తమ హనీమూన్ వేదికగా ఎంచుకుంది. 
 
నయనతారతో తన భావోద్వేగాలను పంచుకుంటున్న ఫొటోలను విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీరిద్దరూ ఇక్కడి సముద్ర తీరప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్ విల్లాలో బస చేసినట్టు తెలుస్తోంది. "నా స్వీట్ హార్ట్‌తో థాయ్ లాండ్ లో అంటూ" విఘ్నేశ్ శివన్ తన పోస్టులో పేర్కొన్నాడు. 
 
ఇకపోతే.. జూన్ 9న పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరు ఎట్టకేలకు ఓ ఇంటివారైన సంగతి విదితమే.