సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2024 (22:54 IST)

ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబు

Mahesh Babu
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబును చూడాలన్న కుతూహలం ఆయన ఫ్యాన్స్ కి ఎప్పటి నుంచో పెద్ద కల. దాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిజం చేయబోతున్నాడని టాలీవుడ్ ఫిలిమ్ జనం చెప్పుకుంటున్నారు. త్వరలో మహేష్ బాబు తలపై నెమలి పింఛంతో కనిపించబోతున్నారట.
 
అసలు విషయానికి వస్తే... అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న దేవకి‌నందన వాసుదేవ చిత్రంలో కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు కొద్దిసేపు కనిపిస్తారని  ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ వార్తను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులకు పండగే.