శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: గురువారం, 6 సెప్టెంబరు 2018 (18:48 IST)

క్ష‌ణం డైరెక్ట‌ర్ సినిమా అక్కడే? ఈ నగరానికి ఏమైంది దెబ్బకు సురేష్ బాబు జడుసుకుంటున్నారట...

క్ష‌ణం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... తొలి చిత్రంతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరేపు. ఈ సినిమా స‌క్స‌స్ సాధించ‌డంతో ర‌వికాంత్‌కి రామానాయుడు స్టూడియో నుంచి ఫోన్ వ‌చ్చింద‌ట‌. సురేష్ బాబు కోటి రూపాయల బ‌డ్జెట్లో సినిమా చేయ

క్ష‌ణం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... తొలి చిత్రంతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరేపు. ఈ సినిమా స‌క్స‌స్ సాధించ‌డంతో ర‌వికాంత్‌కి రామానాయుడు స్టూడియో నుంచి ఫోన్ వ‌చ్చింద‌ట‌. సురేష్ బాబు కోటి రూపాయల బ‌డ్జెట్లో సినిమా చేయ‌మ‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. ఇది జ‌రిగి చాలా రోజులు అయ్యింది. కానీ... ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా ఏమైందో తెలియ‌దు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఏం జ‌రిగిందంటే... ఈ సినిమా కంప్లీట్ అయ్యింద‌ట‌. 
 
అయితే.. అవుట్‌పుట్ చూసిన త‌ర్వాత సురేష్ బాబుకి సంతృప్తి క‌ల‌ుగ‌లేద‌ట‌. అందుకని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టార‌ట‌. త‌రుణ్ భాస్క‌ర్ ఈ న‌రానికి ఏమైంది సినిమా విష‌యంలో కూడా ఇలాగే జ‌రిగింద‌ట‌. చాలా రోజులు రిపేర్లు చేసిన త‌ర్వాత రిలీజ్ చేసారు. ఇప్పుడు ర‌వికాంత్ సినిమా కూడా ఇదే ప‌రిస్థితి అని చెప్పుకుంటున్నారు‌. ప్ర‌స్తుతం కేరాఫ్ కంచ‌ర‌పాలెం సినిమా హ‌డావిడిలో ఉన్నారు. ఇది అయిన త‌ర్వాత అప్పుడు ర‌వికాంత్ సినిమాపై దృష్టిపెడ‌తార‌ట‌. మ‌రి.... చాలామంది ద‌ర్శ‌కులు రెండో సినిమా విష‌యంలో చ‌తికిల‌ప‌డ‌తారు. ర‌వికాంత్ ఏం చేస్తాడో..?