శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (18:38 IST)

ఒకే రోజు ఇద్దరబ్బాయిలు డేటింగ్‌కు పిలిచారు.. చివరికి ఆ వ్యక్తితో?: రాధికా ఆప్టే

బోల్డ్‌గా నటించడమే కాకుండా.. ఉన్నది ఉన్నట్టు, నిక్కచ్చిగా మాట్లాడిగలిగే సత్తా రాధికా ఆప్టే సొంతం. పెళ్లికి తర్వాత సినిమాల్లోకి వచ్చిన రాధికా ఆప్టే.. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. పెళ్లైనా కూడా అందాలను ఆరబోసేందుకు రాధికా ఆప్టే వెనకాడలేదు. నటనతో పాటు అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల మీటూ ఉద్యమం గురించి కూడా నోరెత్తి ఈ నటీమణి.. తాజాగా పెళ్లికి ముందు జరిగిన విషయాలను గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. 
 
పెళ్లికి ముందు ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు తనను డేటింగ్‌కు ఆహ్వానించారని చెప్పింది. తానెప్పుడూ తనకంటే చిన్నవయసు వారితో డేటింగ్ చేయలేనని చెప్పింది. అలాంటిది పెళ్లికి ముందు ఇద్దరబ్బాయిలు తనను డేటింగ్ రమ్మన్నారు. ఆ ఇద్దరిలో ఆమె భర్త బెనెడిక్ట్ కూడా ఒకరని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. 
 
ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక.. తన స్నేహితురాలితో చర్చించానని.. చివరికి చేపను వండి మా ఇంటికి వచ్చే పిల్లి పెట్టాలనుకున్నాం. పిల్లి ఆ వంటకాన్ని తింటే.. బెనెడిక్ట్‌తో డేటింగ్‌కు వెళ్లాలని.. తినకపోతే మరో కుర్రాడితో డేటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా. 
 
ఆ పిల్లి చేపను తినడంతో బెనెడిక్ట్‌తోనే డేటింగ్‌కు వెళ్లానని.. చివరికి అతనినే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. పెళ్లైన తర్వాత నగ్న దృశ్యాల్లో నటించినా.. తన భర్త ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని రాధికా వెల్లడించింది. ఈ వ్యవహారంపై భర్తతో విభేదాలు వచ్చిన సందర్భాలు కూడా లేవంది.