శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:21 IST)

బోరింగ్ మూవీ.... సినిమా చూస్తూ మధ్యలో నిద్రపోయా : ఎస్ఎస్ రాజమౌళి

నాలుగు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న హాలీవుడ్ మూవీపై టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఒక బోరింగ్ చిత్రమని, ఆ చిత్రాన్ని వీక్షిస్తూ మధ్యలో నిద్రపోయినట్టు చెప్పుకొచ్చారు. 
 
కాగా, నాలుగు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు కైవసం చేసుకున్న మూవీ 'పారాసిట్' (తెలుగులో పరాన్నాజీవి). ఈ కొరియా మూవీకి బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రంపై విమర్శలు చేశారు. అదొక బోరింగ్ మూవీ, తాను సినిమా చూస్తూ మధ్యలో నిద్రపోయాను అని కామెంట్స్ చేశారు.
 
ఈ ఆస్కార్ అవార్డుల విన్నింగ్ మూవీపై రాజమౌళి చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి తమకుతోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రాజమౌళి చేసిన కామెంట్స్‌ను సమర్థిస్తుంటే మరికొందరు పేరొందిన దర్శకుడుగా ఉన్న రాజమౌళి అలాంటి కామెంట్స్ చేసివుండాల్సింది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఇకపోతే, ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 నుంచి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరక్కిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే యేడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.