గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (15:33 IST)

ప్రియుడిని పెళ్లాడనున్న రకుల్ ప్రీత్ సింగ్... నెట్టింట వైరల్‌గా వెడ్డింగ్ డేట్?

rakul preeth singh
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ న ప్రియుడిని వివాహమాడనుంది. ఆమె ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరి పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటామని గతంలో రకుల్‌ స్పష్టతనిచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ఈ యేడాది ఫిబ్రవరి 22వ తేదీన గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ పలు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారని ఆయా వార్తల్లోని సారాంశం. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారడంతో సినీ ప్రియులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
 
కాగా, రకుల్ ప్రీత్ సంగ్ 'గిల్లి' అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. 
 
ప్రస్తుతం ఆమె తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ నటిగా రాణిస్తున్నారు. ఆమె నటించిన 'అయాలన్‌' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బీటౌన్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో ఆమె ప్రకటించారు.