చరణ్-కొరటల శివ కాంబినేషన్లో సినిమా?

Ram Charan
శ్రీ| Last Modified బుధవారం, 21 అక్టోబరు 2020 (23:24 IST)
చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ శివ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్టయినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేనషన్లో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్‌గా మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ - వివి వినాయక్ ముఖ్య అతిథులుగా ఓ ప్రాజెక్టు స్టార్టయ్యింది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది.

వీళ్లిద్దరూ ఎవరి ప్రాజెక్టులో వారు బిజీ అయిపోయారు. ప్రస్తుతం కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు కలసి
సంయుక్తంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆచార్య సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

చిరు 152వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అదే సమయంలో కొరటాల శివ నెక్స్ట్ అల్లు అర్జున్‌తో ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం 'ఆచార్య' తో పాటు బన్నీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కొరటాల శివ..రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కొరటాల స్నేహితుడొకరు నిర్మాతగా వ్యవహరించనున్నారట. కొరటాల త్వరలో స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి చరణ్‌కి వినిపించనున్నారని తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :