శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 14 అక్టోబరు 2020 (21:58 IST)

చరణ్‌ ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకుంటున్నాడా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ వైపు ఆర్ఆర్ఆర్, మరోవైపు ఆచార్య సినిమా చేస్తున్నారు. అయితే... ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసాడు కానీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మాత్రం నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. దీంతో చరణ్‌ తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.
 
భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములు, వంశీ పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. అది కూడా ప్లాప్ డైరెక్టర్ పేరు వినిపిస్తుండడం విశేషం. ఎవరా డైరెక్టర్ అంటే.. అశోక్, అతిథి, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్, టెంపర్, ఎవడు చిత్రాలకు స్టోరీ అందించిన రచయిత వక్కంతం వంశీ. ఈ సినిమాల తర్వాత వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాతో దర్శకుడి మారారు.
 
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పటి నుంచి వక్కంతం వంశీ మరో సినిమాని డైరెక్ట్ చేయలేదు. అయితే.. పవన్-సురేందర్ రెడ్డి మూవీకి, అఖిల్-సురేందర్ రెడ్డి మూవీకి కథలు అందిస్తున్నాడు. 
 
రీసెంట్‌గా చరణ్‌‌కి కథ చెప్పాడని.. కథ విని చరణ్ ఓకే చెప్పాడు అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చరణ్ ఫ్లాప్ డైరెక్టర్‌కి ఓకే చెప్పాడా అనే ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సివుంది.