రమ్యకృష్ణ అసలు వయసెంత.. వికీపీడియాలో నెటిజన్ల సెర్చింగ్...

సీనియర్ నటి రమ్యకృష్ణ అసలు వయసు ఎంతో ఎవరికీ తెలియదు. కానీ, సినీ ప్రేక్షకులకు మాత్రం 30 యేళ్లుగా తెలుసు. అటు గ్లామర్‌తోపాటు ఇటు అద్భుతమైన నటనా కౌశలం ఆమె సొంతం. ‘నరసింహ’, ‘అమ్మోరు’ ‘బాహుబలి’ ఆమె అద్భుత

ramyakrishna
chitra| Last Updated: శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (12:27 IST)
సీనియర్ నటి రమ్యకృష్ణ అసలు వయసు ఎంతో ఎవరికీ తెలియదు. కానీ, సినీ ప్రేక్షకులకు మాత్రం 30 యేళ్లుగా తెలుసు. అటు గ్లామర్‌తోపాటు ఇటు అద్భుతమైన నటనా కౌశలం ఆమె సొంతం. ‘నరసింహ’, ‘అమ్మోరు’ ‘బాహుబలి’ ఆమె అద్భుత నటనకు ఉదాహరణలు. 1985లో ఓ మలయాళ సినిమా ద్వారా చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ కీలక పాత్రలు చేస్తూ సినిమాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఆమె గురువారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఈ సీనియర్ నటి వయసెంతో తెలుసుకునేందుకు నెటిజన్లు అమితాసక్తిని చూపారు. ''వికీపీడియా'' ఓపెన్‌ చేసేసి చెక్‌ చేశారు. ఇందులో ఆమె వయసు 46గా ఉంది. కానీ, ఆమె అసలు వయసెంతో పుట్టిన రోజు సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

ఆమె తన భర్త కృష్ణవంశీ, కొడుకు రిత్విక్‌తో కలిసి తన 50వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. రమ్యకృష్ణ అసలు వయసు తెలుసుకుని అందరూ షాకైపోయారు. ఇప్పటికీ గ్లామర్‌ పాత్రలు చేయడానికి వెనుకాడని రమ్యకు 50 ఏళ్లు ఉంటాయంటే నమ్మలేకపోతున్నారు. కానీ, ఆమే స్వయంగా చెప్పడంతో నమ్మక తప్పడం లేదు.దీనిపై మరింత చదవండి :