శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (14:14 IST)

పబ్లిసిటీ కోసమే పవన్‌పై చీప్ కామెంట్స్ : రేణు దేశాయ్

తన మాజీ భర్త, హీరో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్‌పై నటి రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చీప్ పబ్లిసిటీ కోసమే రేణూ దేశాయ్ ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారంటూ మం

తన మాజీ భర్త, హీరో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్‌పై నటి రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చీప్ పబ్లిసిటీ కోసమే రేణూ దేశాయ్ ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో నుంచి ఎలిమినేట్ అయ్యాక మహేష్ కత్తి... పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఇదేసమయంలో వవన్ అభిమానుల నుంచి అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. నిర్మాత బండ్ల గణేష్‌లాంటి వారైతే ఏకంగా మాడిపోతావంటూ హెచ్చరికలు జారీచేశారు. 
 
ఈనేపథ్యంలో, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కత్తి మహేష్‌పై మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే పవన్‌పై చీప్ కామెంట్లు చేస్తున్నారని... అసలు తనకు కత్తి మహేష్ ఎవరో కూడా తెలియదని అన్నారు. వపన్ ఎలాంటి వ్యక్తో తెలిసిన వారెవరూ ఆయనపై చిన్న విమర్శ కూడా చేయలేదని తెలిపారు. మహేష్‌లాంటి వ్యక్తులపై ఇంత చర్చ కూడా అనవసరమని ఆమె వ్యాఖ్యానించింది.