శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 ఫిబ్రవరి 2020 (17:33 IST)

రోజాతో షోలు చేయించడానికి ఛానళ్లు వెంపర్లాడుతున్నాయా? ఏంటా క్రేజూ?

ఆర్కే రోజా. సినిమాల్లో క్వీన్. బుల్లితెరపైనా అంతే. ఇక రాజకీయాల్లో అయితే రాణించిన నటిగా ఆమెనే చెప్పుకుంటున్నారు. ఏదైనా మనసులో వున్నదాన్ని వున్నట్లు అలా మాట్లాడేయడమే ఆమెకి ప్లస్ పాయింట్స్ అంటుంటారు చాలామంది. ఈమధ్యనే శాసనమండలిలో చర్చ జరుగుతుంటే, బాలయ్య గుండుతో న్యూ గెటప్‌లో కనబడేసరికి ఏమాత్రం భేషజాలకి పోకుండా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు రోజా. 
 
ఇక అసలు విషయానికి వస్తే... పొలిటీషియన్‌గా బిజీగా వున్నప్పటికీ రోజా అప్పుడప్పుడు బుల్లితెరపై మెరుస్తున్నారు. జబర్దస్త్ షోలో ఆమె కామెడీ షో గురించి వేరే చెప్పక్కర్లేదు. అలాంటి షోలను సింపుల్‌గా ఒంటి చేత్తో లాగించేయడం రోజాకే తెలుసంటున్నారు.
 
తాజాగా మరో వార్త జనంలోకి వచ్చింది. అదేమిటంటే... ప్రముఖ ఛానల్ రోజాతో సరికొత్త షోను చేయించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇందుకుగాను రోజాకి భారీగా పారితోషికం ఇచ్చేందుకు సై అంటోందట. ఆ ఛానెల్ ను చూసి మరో ఛానెల్ కూడా అంతకంటే తాము ఎక్కువిస్తామనీ, తమకు ఓ షో చేసి పెట్టమని బ్రతిమాలాడుతున్నారట. మొత్తమ్మీద రోజా క్రేజ్ మామూలుగా లేదు కదూ...