గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2023 (18:20 IST)

అద్భుతమైన ఆఫర్‌ను మిస్ చేసుకున్న సమంత, అందుకేనా?

samantha
సమంత ఇటీవలే నటించిన చిత్రం ఖుషీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఐతే అంతకంటే భారీ హిట్ కొట్టిన జవాన్ చిత్రం ఆఫర్‌ను మిస్ చేసుకున్నదట సమంత. నయనతార నటించిన పాత్రలో సమంతను తీసుకునేందుకు దర్శకుడు అట్లీ ప్రయత్నించాడట. ఐతే తనకు మయోసైటిస్ సమస్య వున్నదనీ, చిత్రాన్ని అంగీకరించి ఇబ్బంది పెట్టదలుచుకోలేదని సమంత ఆ అవకాశాన్ని తిరస్కరించిందట. దానితో ఆ బిగ్ ఆఫర్ మిస్ అయ్యింది. షారూక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
 
ఇదిలావుంటే తాజాగా మరో వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని సమంత దక్కించుకున్నదని. ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాత అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ వార్తలను నిజం చేస్తున్నట్లు సమంత విదేశాల నుంచి నేరుగా ముంబై వెళ్లిందట. అక్కడ చిత్రం గురించి కరణ్‌తో చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.