గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (17:13 IST)

ఏ మాయ చేసావే సీక్వెల్.. సమంత స్థానంలో రష్మిక..?

em maya chesave movie still
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయ చేశావే సినిమా భారీ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా హోల్ ప్యాక్డ్ ఎంటర్ టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య, సమంత కెమిస్ట్రీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన చైతూ-శామ్ ఆపై విడాకులు కూడా తీసేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తారాగణం ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది. రెండో పార్టులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని, హీరోయిన్ సమంత స్థానంలో రష్మిక మందన నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.