గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (11:16 IST)

టాలీవుడ్‌లో వరుసగా పెళ్ళిల్లు. పెళ్లికొడుకు శర్వా.. మరి పెళ్లి కూతురు..?

టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఏ ముహుర్తన టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ద్వితీయ వివాహం చేసుకున్నారో కానీ... అప్పటి నుంచి యువ హీరోలు వరుసగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఇటీవల నితిన్, నిఖిల్, దగ్గుబాటి రానా.. పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చిరు ఫ్యామిలీలో నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక ఎంగేజ్ మెంట్ జరిగింది.
 
రీసెంట్‌గా జరిగిన ఎంగేజ్ మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇలా… వరుసగా పెళ్లిలు జరుగుతున్నాయి.
 
 అయితే.. యువ హీరో శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 
 
ఇంతకీ… శర్వానంద్ తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఆమె యువ పారిశ్రామికవేత్త అని.. ఈ పెళ్లి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై శర్వానంద్ స్పందిస్తారేమో చూడాలి.