మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:17 IST)

ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ముచ్చటగా ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అదీ కూడా ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఏకంగా ముగ్గురుని వివాహం చేసుకున్నారు. ఇది హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సహారా ఎస్టేట్‌లోని గాంధార అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఎడ్ల శంకరయ్య (39) సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ 2011లో ఓ మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమెను వదిలివేశాడు. 
 
ఆ తర్వాత 2016లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. యేడాది తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. శంకరయ్యకు ఇటీవల బదిలీ అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో శారదకు దూరంగా ఉండసాగాడు. 
 
ఈ క్రమంలో గతేడాది నవంబరు 30న సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులారాణి అనే మహిళను లోబరుచుకుని తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరయ్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మూడు పెళ్లిళ్ళ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.