శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 ఆగస్టు 2020 (13:00 IST)

మరోసారి కత్తి మహేష్ అరెస్ట్

సినిమా విమర్శకుడు, వివాదాస్పద నటుడు కత్తి మహేష్ మరోసారి అరెస్టయ్యారు. ‘కరోనా ప్రియుడు శ్రీరాముడు’ అంటూ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు కత్తి మహేష్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.
 
అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు కత్తి మహేష్‌. అయితే  తాజాగా అతనిపై పీటీ వారెంట్‌ జారీ అవడంతో మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ కుమార్ అనే వ్యక్తి  ఫిర్యాదు ఆధారంగా కత్తి మహేష్‌ని గురువారం మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
 
ఫిబ్రవరి నెలలో కూడా ఇలాగే సామాజిక మాధ్యమాల వేదికగా కత్తి మహేష్ వివాదాస్పద కామెంట్స్ చేశాడంటూ ఉమేష్ కుమార్ కేసు పెట్టడంతో అతడి మీద పీటీ వారెంట్ జారీ అయింది.