నేను 'సీత'లా చేయలేనంటున్న శ్రద్ధా కపూర్... ఏమైంది?

Sradha Kapoor
జె| Last Modified సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:43 IST)
సినిమాల అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. నాకు ఖాళీ లేదు. గ్యాప్ ఇవ్వండి. నన్ను ఊపిరి పీల్చుకోనీయండి అంటూ శ్రద్థాకపూర్ దర్సక, నిర్మాతలకు దణ్ణం పెట్టేస్తోంది. సాహో సినిమాలో శ్రద్ధాకపూర్ చెలరేగి నటించింది. ఆ సినిమాలో ఆమెకు మంచి మార్కులే వచ్చాయి. ఆ తరువాత కాస్త కూడా గ్యాప్ లేకుండా నటిస్తోంది. సినిమా అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా తనకు కాస్త గ్యాప్ కావాలంటోంది శ్రద్ధాకపూర్.

కానీ తాజాగా ఆమెకు 1500 కోట్ల రూపాయలతో నిర్మితమయ్యే భారీ బడ్జెట్ మూవీ రామాయణంలో అవకాశం వచ్చిందట. అల్లు అరవింద్ నిర్మాత. హీరో హృతిక్ రోషన్. విలన్ క్యారెక్టర్‌కు ప్రభాస్‌ను ఫిక్స్ చేశారు. అయితే ముందుగా సీతగా దీపికా పదుకునె అనుకున్నారట.

కానీ ఆమె ఆ క్యారెక్టర్‌కు సరిపోదని అల్లు అరవింద్ నిర్ణయించుకుని శ్రద్ధా కపూర్‌ను ఫిక్స్ చేశారట. నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా శ్రద్ధకు ఫోన్ చేశారట. మా సినిమాలో సీత క్యారెక్టర్ చేయాలని కోరాడట. సర్.. నాకు కాస్త గ్యాప్ ఇవ్వండి.. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని చెప్పి రిక్వెస్ట్ చేసిందట.

అంతేకాదు మరికొంతమంది డైరెక్టర్లకు ఇదే మాట చెబుతోందట శ్రద్ధా కపూర్. అంత భారీ బడ్జెట్ సినిమానే వద్దనుకుంటుందంటే శ్రద్థ ఎంత బిజీగా ఉందో అర్థమవుతోంది. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీకి దర్శకుడు నితీష్ తివారి. గతంలో శ్రద్ధాకపూర్‌కు హిట్ ఇచ్చిన దర్సకుడు ఆయన. దీంతో దర్శకుడే స్వయంగా శ్రద్ధను రిక్వస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :