సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (16:11 IST)

తాగుబోతు మీదకి వస్తుంటే కొట్టాను.. కీర్తి సురేష్

keethi suresh
సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేదు. హీరోయిన్లు కూడా.. వేధింపుల నుంచి తప్పుకోవడం లేదు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గతంలో తనకు జరిగిన షాకింగ్ సంఘటనను షేర్ చేసింది. నడిరోడ్డుపై తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పింది. 
 
సీనియర్ హీరోయిన్ మేనక కూతురు కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆమె తన తల్లి వారసత్వాన్ని నిలబెట్టే స్టార్‌గా ఎదిగింది. మహానటి కీర్తి సురేష్‌కి బ్రేక్ ఇచ్చింది. మరో వరుస విజయాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ భోళా శంకర్ రూపంలో ఫ్లాప్ సినిమాలను అందించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్ చిరంజీవి నటించిన చిత్రంలో కీర్తి సురేష్ చెల్లెలి పాత్రను పోషించింది. 
 
కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. "కాలేజ్‌ రోజుల్లో నేనూ, నా స్నేహితురాలు రోడ్డుపై నడిచేవాళ్లం. ఒక తాగుబోతు నా దగ్గరకు వచ్చాడు. అతను నా మీదికి రాబోతున్నాడు. ఆ తాగుబోతుని కొట్టాను. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు." అంటూ చెప్పింది. చిన్న వయసులో కీర్తి సురేష్ చూపిన ధైర్యానికి నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.