ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (12:01 IST)

సన్నీలియోన్ అందుకే తెలుగులో నటించలేదట.. డేట్లు అడ్జస్ట్‌ కాకపోవడమే..?

ఒకప్పుడు పోర్న్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాల్లోనూ సైతం సన్నీ లియోన్ మెరిసింది. కరెంట్ తీగ సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా విడుదలై మూడేళ్ల గడుస్

ఒకప్పుడు పోర్న్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాల్లోనూ సైతం సన్నీ లియోన్ మెరిసింది. కరెంట్ తీగ సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా విడుదలై మూడేళ్ల గడుస్తున్నప్పటికీ.. ఆమె ఇంతవరకు టాలీవుడ్‌లో మరో సినిమా చేయలేదు. 
 
ఇందుకు సన్నీలియోన్ కారణమేమిటో తెలిపింది. ఉత్తరాది కంటే దక్షిణాది సినిమాలే సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పింది. డేట్లు అడ్జస్ట్ అయితే తెలుగులో కచ్చితంగా నటిస్తానని తెలిపింది. డేట్లు అదనంగా అడగారని, చెప్పిన సమయానికే షూటింగ్ మొదలు పెట్టడం, షూటింగ్ ముగించడం చేస్తారని కితాబిచ్చింది.
 
'కరెంట్ తీగ' సినిమా తర్వాత తనను ఎంతోమంది దక్షిణాది దర్శకనిర్మాతలు కలిశారని, కొన్ని సినిమాలకు డేట్లు కుదరకపోతే, మరికొన్ని సినిమాల్లో తన క్యారెక్టర్ నచ్చలేదని సన్నీ లియోన్ తెలిపింది. వాస్తవానికి తెలుగులోనే కాకుండా.. దక్షిణాది వారి సినీ నిర్మాణం తనకు బాగా నచ్చుతుందని తెలిపింది.