మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (23:04 IST)

బాలయ్యతో పోటీ పడనున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. సీన్స్ అదిరిపోతాయట!

Balakrishna,  Varalakshmi
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణ అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నారు.
 
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపుడితో సినిమా చేయనున్నారు.
 
ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ విడుదలైంది. అనిల్ రావిపూడి బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణతో లేడీ విలన్ పోటీ పడిబోతున్నట్లు తెలుస్తోంది. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 
 
ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ సినిమాలో కూడా ఈమె బాలయ్యతో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమాలో కూడా వరలక్ష్మి నటిస్తున్నట్లు సమాచారం.