సిఎం కొడుకును డైరెక్ట్ చేయనున్న నితిన్ డైరెక్టర్..!
సిఎం కొడుకును డైరెక్ట్ చేయనున్న నితిన్ డైరెక్టర్ అనగానే ఎవరా డైరెక్టర్ అని ఆలోచిస్తున్నారా..? గుండెజారీ గల్లంతయ్యిందే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ కుమార్ కొండ. ఈ మూవీ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో ఒక లైలా కోసం చిత్రాన్ని తెరకెక్కించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే సీక్వెల్ తీయాలని ట్రై చేసాడు కానీ వర్కవుట్ కాలేదు.
ఇక అసలు విషయానికి వస్తే... విజయ్ కుమార్ కొండ కన్నడ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామిని డైరెక్ట్ చేయబోతున్నాడట. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి సంబంధించ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 16న ఈ చిత్రాన్ని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి... ఈ సినిమాతో నిఖిల్ కుమారస్వామి తెలుగులో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.