గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (11:08 IST)

వార్-2లో ఎన్టీఆర్ సరసన ఎవరు..? ఆ ఇద్దరి మధ్య పోటీ?

వార్-2లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ సుందరి అలియా భట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో నాయికగా కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరో సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 
 
హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా 'వార్ 2' రూపొందుతోంది. 
 
హృతిక్ రోషన్ పై కొన్ని కీలకమైన సీన్స్‌ను అయాన్ ముఖర్జీ చిత్రీకరిస్తున్నాడు. 'దేవర' తరువాత ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయినవుతాడని అంటున్నారు.