శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 జులై 2017 (13:03 IST)

జయ జానకి నాయక దర్శకుడితో అఖిల్ సినిమా?

బోయపాటి తాజా చిత్రంగా రూపొందిన 'జయ జానకి నాయక' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక బాలకృష్ణతో చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే అఖిల్ తోను బోయపాటి చేసే ఛాన్స్ ఉందనేది తాజా సమాచారం. ప్

బోయపాటి తాజా చిత్రంగా రూపొందిన 'జయ జానకి నాయక' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక బాలకృష్ణతో చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే అఖిల్ తోను బోయపాటి చేసే ఛాన్స్ ఉందనేది తాజా సమాచారం. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఓ రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.
 
ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును అఖిల్ ఎవరితోను కమిట్ కాలేదు. అందువలన బోయపాటితో అఖిల్ తదుపరి సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే బోయపాటిని పర్సనల్‌గా కలిసి నాగార్జున చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 
 
కాగా బోయపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తూ ఉండగా రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. మాస్‌కి కాస్త దూరంగా ఒక సూపర్ లవ్ స్టోరీతో ప్రయోగం చేసాడు బోయపాటి.