శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 13 జులై 2017 (14:21 IST)

ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచైనా సీటిస్తాం... జబర్దస్త్ టీం కమెడియన్‌కు వైసీపీ బంపర్ ఆఫర్

జబర్దస్త్ షోలో నటిస్తున్న నటుల దశ తిరుగుతోంది. ఇప్పటికే జబర్దస్త్‌కు ఎక్కడ లేని క్రేజ్ రావడంతో పాటు ఆ కార్యక్రమాన్ని చూసిన మిగిలిన రాష్ట్రాల వారు తమతమ భాషల్లో కూడా అలాంటి కార్యక్రమాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రధానంగా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర

జబర్దస్త్ షోలో నటిస్తున్న నటుల దశ తిరుగుతోంది. ఇప్పటికే జబర్దస్త్‌కు ఎక్కడ లేని క్రేజ్ రావడంతో పాటు ఆ కార్యక్రమాన్ని చూసిన మిగిలిన రాష్ట్రాల వారు తమతమ భాషల్లో కూడా అలాంటి కార్యక్రమాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రధానంగా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, హైపర్ ఆదిలే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంటారు. వీరు మొదట్లో సాధారణ కెమడియన్లు. కానీ ఆ తరువాత ఒక్కసారిగా వీరికి క్రేజ్ పెరిగిపోయింది. 
 
వీరు ఎక్కడికి వెళ్ళినా జబర్దస్త్ టీం అంటూ గుర్తు పెట్టేస్తారు. అంతేకాదు నిక్ నేమ్‌లతో పిలిచేస్తుంటారు. కొంతమందికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే మరికొంతమందికి రాజకీయ అవకాశాలే వచ్చాయి. అందులో హైపర్ ఆది ఒకరు. ఆది సొంత జిల్లా ప్రకాశం. ముందు నుంచే రాజకీయాల్లోకి వెళ్ళాలన్నదే ఆయన ఆలోచన. అయితే చివరకు కమెడియన్ గానే ఆయన ప్రస్తుతం స్థిరపడ్డారు. ఒక్కసారి క్రేజ్ పెరిగిన తరువాత రాజకీయ నాయకులతో పరిచయాలు కూడా పెరిగాయి.
 
అందులోను వైఎస్ఆర్ సిపి నేతలతో మరింత చనువు ఏర్పడింది హైపర్ ఆదికి. అదే ప్రస్తుతం ఆయనకు మంచి ఫలితాన్నిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్థమై పోయారు. ఇప్పటికే దీనిపై మాట్లాడి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. హైపర్ ఆదికి ఉన్న అభిమానుల క్రేజ్ చూస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉందని వైసిపి భావిస్తోంది. అందుకే ఏ నియోజవర్గం అడిగితే ఆ నియోజకవర్గం ఆదికి ఇవ్వడానికి జగన్ కూడా సిద్థంగా ఉన్నారట.