గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (20:47 IST)

దక్షిణాదిలో గోళ్లు గిల్లుకుంటున్న త్రిష.. బాలీవుడ్ నుంచి కాల్

ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ పరిశ్రమల్లో విపరీతమైన పోటీ నెలకొనడంతో త్రిష ప్రస్తుతం ఆఫర్లు లేక గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూచుంటోంది. ఆమె నటించిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడ్డాయి. వీటికితోడు... సెక్సీ హీరోయిన్స్ తమన్నా, తాప్సీ, సమంత, కాజల్ అగర్వాల్ వంటి వారి నుంచి తీవ్రమైన పోటీ వస్తుండటంతో వాళ్లను అధిగమించడంలో త్రిష చతికిలపడింది. 

ఈ పరిస్థితుల్లో త్రిషకు బాలీవుడ్ ఆఫర్ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. తమిళంలో సామిగా తెరకెక్కిన చిత్రాన్ని కెఎస్ రవికుమార్ బాలీవుడ్‌లో సంజయ్ దత్‌తో తీస్తున్నాడు. ఈ చిత్రంలో తన సరసన త్రిష అయితే బావుంటుందని అన్నాడట. అంతే... త్రిషకు పిలుపు అందింది.

ఐతే ఇంతకుముందు బాలీవుడ్‌లో నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని త్రిష ఓకే చెపుతుందో లేదో చూడాలి.