రవితేజ "నిప్పు" కాదు.. చాలా కూల్: దీక్షాసేథ్
హీరోలతో హీరోయిన్లు కలిసి నటించేటప్పుడు హీరోల ఎంకరేజ్‌మెంట్ చూసి గొప్పగా చెబుతుంటారు. రవితేజ విషయంలో పొడుగుకాళ్ల సుందరి దీక్షాసేథ్ కూడా ఆ పనే చేసింది. 'నిప్పు' సినిమాలో కలిసి నటించింది.
పేరుకు నిప్పు అయినా... రవితేజతో ఉంటే.. చాలా కూల్‌గా, జోవియల్‌గా ఉంటుందని చెప్పింది. ఆయన సెట్లో ఉన్నంతసేపూ సరదాగా ఉంటారు. మనలో కూడా ఉత్సాహం పొంగుకొస్తుంది. కానీ సీన్‌లోకి వెళితే.. రెచ్చిపోతారు అని అంటుంది. రెండోసారి ఆయనతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. విక్రమ్‌తో నటించిన వీడింతే పరాజయం పట్ల అన్ని మనం అనుకున్నట్లు జరగవు కదా అని వేదాంత ధోరణిలో చెప్పింది.