శనివారం, 16 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

విడాకులకోసం కోర్టుకెక్కిన సోనీ, సెల్వ రాఘవన్

చాలామంది సినీ జంటల జీవితాల మాదిరే సోనీ అగర్వాల్, సెల్వ రాఘవన్‌ల ప్రేమ వివాహ బంధం విడాకులతో తెగిపోతోంది. కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌‍గా ఉన్న సమయంలో సోనీని సెల్వ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత సెల్వ రాఘవన్ ఆండ్రియా అనే తమిళ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో సోనీ అగర్వాల్ పలుమార్లు సెల్వను నిలదీసినట్లు భోగట్టా. 

సోనీ మాటలను పట్టించుకోని సెల్వ తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోపోవడంతో, సోనీ అగర్వాల్ చివరికి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని కోలీవుడ్ పత్రికలు వార్తలను ప్రచురించాయి. అయితే ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదని సోనీ అగర్వాల్ తెగేసి చెప్పింది.

సెల్వకు తనకు మధ్య కొన్ని మనస్పర్థలు తలెత్తడంతో విడిపోదామనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తారా.. అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రస్తుతం తను ఒంటరితనాన్ని కోరుకుంటున్నానీ, తన మనసుకైన గాయం మానిన తర్వాత తిరిగి కొత్త సోనీగా వస్తానని చెప్పింది.