బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 17 జులై 2021 (18:54 IST)

వెబ్ గేమింగ్ నేపథ్యంలో ‘అహం బ్రహ్మస్మి’

Abhishek Agarwal, etc
వెబ్ దునియాలో వైవిధ్యమైన కథలతో ఆకట్టుకున్నారు కుర్రకారు. అయితే తెలుగులో ఇప్పటి వరకూ అద్భుతం అనిపించే వెబ్ సిరీస్ రాలేదనే చెప్పాలి. ఆ లోటును భర్తీ చేసేందుకే మేమొస్తున్నాం అంటూ ‘అహం బ్రహ్మస్మి’ అనే వెబ్ సిరీస్ రాబోతోంది.11భాగాలుగా రాబోతోన్న ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందింది. లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సిరీస్ కు సిద్ధార్థ్ పెనుగొండ దర్శకుడు. నేటి ట్రెండ్ కు అనుగుణంగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందించబోతోందీ సిరీస్.
 
సింపుల్ గా చెబితే ఇదో వెబ్ గేమింగ్ నేపథ్యంలో రూపొందిన సిరీస్. ఆడిన ప్రతి ఒక్కరూ ఆ గేమ్ లో విన్ అవ్వాలి. గెలిచిన వారికి భారీ అమౌంట్ వస్తుంది. ఒక వేళ లాస్ అయితే వారికి బాగా నచ్చినవారి ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. మరి ఇంత డేంజరస్ గా ఉన్న ఈ గేమ్ ను ఆపేందుకు లోకల్ డిటెక్టివ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాలూ ఏంటనేది అనూహ్యమైన మలుపులతో.. ఆద్యంతం అద్భుతమనిపించే స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన సిరీసే ఈ అహం బ్రహ్మస్మి.
 
అహం బ్రహ్మస్మి ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. టీజర్ ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన వై రవికుమార్ చేతుల మీదుగా విడుదలైంది. ఇక ట్రైలర్ ను సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
టీజర్, ట్రైలర్ తో భారీగా అంచనాలను పెంచిన అహం బ్రహ్మస్మి వెబ్ సిరీస్ ఈ నెల 18నుంచి అమెజాన్ ప్రైమ్(యూ.ఎస్), అమెజాన్ ప్రైమ్(యూ. కే), ఎమ్.ఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్, విఐ వంటి పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి స్ట్రీమ్ కాబోతోంది.
ఇక ఈ వెబ్ సిరీస్ లో రజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతగంటి, చాందినీరావు, సాయి కేతన్ రావు, కృష్ణతేజ తదితరులు నటించారు.