ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (09:34 IST)

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట వరుస మరణాలు...

mahesh babu
తెలుగు సూపర్ స్టార్‌గా ఉన్న హీరో మహేష్ బాబుకు 2022 సంవత్సరం అస్సలు ఏమాత్రం అచ్చిరాలేదని చెప్పొచ్చు. ఈ యేడాది ఆయన ఇంట వరుస మరణాలు సంభవించాయి. 
 
ఇప్పటికే కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఈ యేడాది జనవరి ఎనిమిదో తేదీన కాలేయ సమస్యలతో కన్నుమూశారు. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి, కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి ఈ యేడాది సెప్టెంబరు 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. 
 
ఇపుడు అంటే నవంబరు 15వ తేదీన మహేష్ బాబు తండ్రి హీరో సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఆదివారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన 24 గంటలు కూడా తిరగకముందే తుదిశ్వాస విడిచారు.