శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జూన్ 2023 (13:45 IST)

మెగాస్టార్ కోసం ఎనిమిది మంది హీరోయిన్లు!

Megastar Chiranjeevi
సాధారణంగా ఒక చిత్రంలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండటం సర్వసాధారణం. అయితే, ఎంతమంది హీరోయిన్ల ఉంటే అంత కిక్కు. అదో కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయింది. అయితే ఓ హీరో పక్కన ఏకంగా ఎనిమిదిమంది హీరోయిన్లు నటించడం అంటే ఓ రికార్డే! మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఈ రికార్డు సృష్టించే పనిలో దర్శక నిర్మాతలు నిమగ్నమైవున్నారు. 
 
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 'బింబిసార'తో ఆకట్టుకొన్న వశిష్ట.. చిరంజీవికి ఓ కథ చెప్పి 'ఓకే' చేయించుకొన్నాడు. ఈ సినిమాని చిరు కుమార్తె సుస్మిత నిర్మించనున్నారు. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇందులో ఏకంగా ఎనిమిది మంది కథానాయికలు ఉన్నట్టు సమాచారం. 
 
ఏదో సంఖ్యాబలం చూపించుకోవడానికి ఈ పాత్రలు ఉండవట. ప్రతీ పాత్రకూ ప్రాధాన్యం ఉంటుందని టాక్. కథలో 8 మంది హీరోయిన్లకు చోటివ్వడం ఈజీనే కావొచ్చు, కానీ వాళ్లని వెదికి పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిత్రసీమలో కథానాయికల డిమాండ్ మామూలుగా లేదు. స్టార్ హీరో సినిమాకి ఒక్క హీరోయిన్ దొరకడమే గగనంగా మారిపోయింది. 
 
అలాంటిది 8 మందిని పట్టాలంటే కొంచెం కష్టమే. కాకపోతే ఇది చిరంజీవి సినిమా కాబట్టి, ఎవరిని అడిగినా 'నో' చెప్పరు అనుకోండి. వాళ్ల కాల్షీట్లు సర్దుబాటు కావడమే ఇక్కడ ప్రధానం. మరి చిరుతో జోడీ కట్టే ఆ ఎనిమిదిమంది హీరోయిన్లు ఎవరో? ఆ పాత్రలకు ఎంతెంత ప్రాధాన్యం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.