సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (10:54 IST)

మహిళా ఫ్యాన్‌ను హగ్ చేసుకున్న లైగర్.. వీడియో వైరల్.. లుక్ అదుర్స్

Liger
Liger
లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ మహిళా వీరాభిమాని కలను సాకారం చేశాడు. తన వీపుపై విజయ్ దేవరకొండ పచ్చబొట్టుతో ఉన్న అభిమాని లైగర్ స్టార్‌ను కలిసింది. దీనికి సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తన ప్రతిభ, సహజ చరిష్మాతో మహిళా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విజయ్ దేవరకొండ.. లైగర్ స్టార్ ఒక డై హార్డ్ అభిమానితో సంభాషించిన వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఈ అభిమాని తన వీపుపై విజయ్ దేవరకొండ చిత్రాన్ని, సంతకాన్ని పచ్చబొట్టు పొడిపించుకుంది. 
 
తన అభిమాన నటుడిని చూసి ఆమె నమ్మలేకపోయింది. కన్నీళ్లు పెట్టుకునేంత వరకు, విజయ్ ఆమెను కౌగిలించుకుని ఓదార్చాడు, ఇది చాలా మంది అభిమానులను 'లక్కీ' సూపర్ అభిమానిని చూసి అసూయపడేలా చేసింది. 
Liger
Liger
 
ఈ యువ తార విజయ్ దేవరకొండ 'లైగర్'తో పరిశ్రమను తుఫాను సృష్టించేందుకు సిద్ధంగా వున్నాడు. లైగర్ స్పోర్ట్స్-యాక్షన్ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఇది విడుదల కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. తాజాగా లైగర్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. 

Liger
Liger