శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (18:22 IST)

ఆగస్టు 22న మెగా కానుక, ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆగస్టు 22న వినాయక చవితి సందర్భాన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. 
 
సాయంత్రం 4 గంటలకు చిరు 152వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో రిలీజ్ కానుందని కొణెదల ప్రొడెక్షన్ కంపెనీ ట్విట్ చేసింది. కొణెదల కంపెనీ సమర్పణంలో వస్తున్న ఈ సందేశాత్మక చిత్రానికి నిరంజన్ రెడ్డి నిర్మాత.
 
చిత్ర సమర్పకుల్లో ఒకరైన రాంచరణ్ స్పందిస్తూ, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో తాము రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ చిత్రానికి టైటిల్ అధికారికంగా ప్రకటించక పోయినా ఆచార్య అనే టైటిల్ సర్క్యులేట్ అవుతుంది. దీంతో అధికారికంగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడం కోసం అభిమానులు చిరు కోసం తమ సంకేతాలను తెలుపుతున్నారు.