సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (15:03 IST)

ప్రభాస్ ఆ మాట అని వుంటే ఆదిపురుష్-Adipurush స్టోరీని చెత్తబుట్టలో వేసేవాడిని అంటున్న డైరెక్టర్

చాలామటుకు సినిమా స్టోరీలు ఫలానా హీరోతో చేయాలి అనుకుని కథలు రాసుకుంటూ వుంటారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఆదిపురుష్ స్టోరీ కూడా ఇలాగే రాసుకున్నారట ఆ చిత్ర డైరెక్టర్ ఓ రౌత్. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ఫేమ్ ప్రభాస్ బాలీవుడ్‌లో తన తొలి ప్రాజెక్టులో నటిస్తున్న నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఇప్పుడు రోజుకో విధంగా చర్చ జరుగుతోంది.
 
ఓం రౌత్ దర్శకత్వంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదిపురుష్ చిత్రానికి హీరోగా ప్రభాస్‌ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారన్న దానిపై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ స్టోరీ రాస్తున్నప్పుడే తను ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకుని రాశానని చెప్పుకొచ్చారు.
 
ప్రభాస్ చాలా శాంతంగా వుంటాడనీ, అతడి రూపం తను రాసుకున్న రాముడి పాత్రకు చక్కగా సరిపోతాడని భావించానన్నారు. ఒకవేళ కథ చెప్పిన తర్వాత ప్రభాస్ నో అని నాతో చెప్పి వుంటే ఆదిపురుష్ స్క్రిప్టును చెత్తబుట్టలో పడేశావాడనని అన్నారు. ఎందుకంటే, ఆ స్క్రిప్టుకి ప్రభాస్ తప్ప ఇంకెవరూ సూట్ కారని అన్నారు.