శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj

ప్రధాని నాకంటే పెద్ద నటుడు : మోడీపై మండిపడ్డ ప్రకాష్‌ రాజ్

అయ్యా.. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మీరు నాకంటే పెద్ద నటుడు. మీ నటన అమోఘం. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్యపై మీరు స్పందించిన తీరు అమోఘం.. అబ్బా.. అబ్బా.. ఏం నటన సార్.. అంటూ ప్రధానిమంత్రిపై తీవ్రస్థాయిలో

అయ్యా.. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మీరు నాకంటే పెద్ద నటుడు. మీ నటన అమోఘం. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్యపై మీరు స్పందించిన తీరు అమోఘం.. అబ్బా.. అబ్బా.. ఏం నటన సార్.. అంటూ ప్రధానిమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్‌ రాజ్ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గౌరీ లంకేష్‌ మృతిపై ప్రధాని తన మౌనం వీడాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు హత్యపై మోడీ మౌనం వీడకుంటే తన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాష్‌ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.