బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (15:04 IST)

లైకాకు డబ్బు ఎందుకు చెల్లించడం లేదని హీరో విశాల్‌కు హైకోర్టు ప్రశ్న

vishal
లైకా నిర్మాణ సంస్థకు హీరో విశాల్ దాదాపు రూ.23 కోట్ల మేరకు రుణం చెల్లించాల్సి వుంది. అయితే డబ్బు పెట్టుకుని కూడా విశాల్‌కు ఎందుకు చెల్లించడం లేదని విశాల్‌ను మద్రాస్ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. దీనికి విశాల్ తరపు న్యాయవాదులు వాదిస్తూ, తాము డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ, లైకా సంస్థ చర్చలకు రావడం లేదని కోర్టుకు తెలిపారు. 
 
విశాల్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నప్పటికీ తమకు డబ్బులు చెల్లించడం లేదంటూ లైకా నిర్మాణ సంస్థ కోర్టుకు తెలిపారు. ఈ విషయం కోర్టుకు ఆయన సమర్పించిన బ్యాంకు లావాదేవీలను బట్టి తెలుస్తుందన్నారు. తమకు చెల్లించాల్సిన నగదులో సగమైనా డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించాలని కోరారు.
 
దీనిపై విశాల్ తరపు న్యాయవాది స్పందిస్తూ, ఈ విషయంలో తమ సమధానానికి కొంత సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో జోక్యం చేసుకున్న కోర్టు లైకా  సంస్థకు చెల్లించాల్సిన సొమ్ము ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ, లైకా సంస్థ చర్చలకు రావడం లేదని విశాల్ తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను వచ్చే నెల ఒకటో తేదీకి కోర్టు వాయిదా వేసింది.