1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:29 IST)

చంద్రబాబును జైల్లో పెట్టడం సబబు కాదు : పూనమ్ కౌర్

poonam kaur
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసి జైల్లో పెట్టడం ఏమాత్రం సబబు కాదని ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అభిప్రాయపడ్డారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో బంధించిన విషయం తెల్సిందే. ఈ అరెస్టును జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలంతా ఖండిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై పూనమ్ కౌర్ స్పందించారు. చంద్రబాబు వయసును దృష్టిలో ఉంచుకుని విచారం వ్యక్తం చేశారు. "73 యేళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసుకాదు. ముఖ్యంగా ప్రజా జీవితంలో చాలాకాలం సేవలు అందించిన తర్వాత ఇలా జైల్లో ఉండటం బాధాకరం. ఇపుడు జరుగుతున్న విషయాలపై తన కెలాంటి అధికారం కానీ, సంబంధం కానీ లేదు. కానీ మానవత్వంతో స్పందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు సార్ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని  ఆమె అభిప్రాయపడ్డారు.