శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (16:08 IST)

విక్టరీ వెంకటేష్ సరసన చెలియా హీరోయిన్?

విక్టరీ వెంకటేష్, తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో నటించేందుకు హీరోయిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయంటూ, అనుష్క, కాజల్ అగర్వాల్, తమ

విక్టరీ వెంకటేష్, తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో నటించేందుకు హీరోయిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయంటూ, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా హీరోయిన్ ఖరారైనట్లు సమాచారం. 
 
ఈ  సినిమా కోసం అదితీరావును ఎంపిక చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అదితి రావుతో సంప్రదింపులు జరిగాయని, సంతకాలు కూడా చేసేశారని టాక్. మణిరత్నం సినిమా 'చెలియా' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితీరావు, ప్రస్తుతం తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేస్తోంది. 
 
తాజాగా తేజ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం వెంకీ- తేజ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.