శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (17:43 IST)

'అజ్ఞాతవాసి' అన్నంత పనీ చేశాడు... ఏం చేశాడంటే?

పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం కోసం యువతే కాదు మహిళలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అర్థరాత్రి నుంచే బారులు తీరారు. ఈ రోజు చిత్రం విడుదలైంది. థియేటర్ల వద్ద ప్రేక్షకులు సందడిగా వుంది. ఇకపోతే అజ్ఞాత

పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రం కోసం యువతే కాదు మహిళలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అర్థరాత్రి నుంచే బారులు తీరారు. ఈ రోజు చిత్రం విడుదలైంది. థియేటర్ల వద్ద ప్రేక్షకులు సందడిగా వుంది. ఇకపోతే అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్‌కు 25వ చిత్రం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అమెరికా, ఆంధ్రప్రదేశ్‌లలో నిన్నరాత్రే ప్రీమియర్ షోలు పడ్డాయి. 
 
అమెరికాలో అజ్ఞాతవాసి అనుకున్నట్లే బాహుబలి ది బిగినింగ్ రికార్డులను బద్ధలు కొట్టాడు. రాత్రి 8.45 నిమిషాల వరకూ విడుదలైన 478 చోట్ల ఏకంగా 1.42 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. బాహుబలి బిగినింగ్ 1.36 డాలర్లను వసూలు చేసింది. కాగా బాహుబలి 2 చిత్రం 2.46 మిలియన్ డాలర్లను వసూలు చేసి అగ్రస్థానంలో వుంది. కాగా బాహుబలి కంక్లూజన్ రికార్డును అందుకోవాలంటే అజ్ఞాతవాసి దూకుడుగా ఆడాలి. చూద్దాం అజ్ఞాతవాసి ఏం చేస్తాడో?